కరీంనగర్ లో మరో ఇద్దరు బిఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..

బలగం టివి, 

రేకుర్తి భూమి కి చెందిన నకిలీ ధ్రువపత్రాలను నిజమైనవిగా చూపించి (₹ 1,37,00000 /-) కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించినందుకు 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త కొల ప్రశాంత్, 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుధగోని కృష్ణగౌడ్ మరియు ఏలేటి భరత్ రెడ్డిలను అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలింపు..

సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని శివసాయి నగర్ కు చెందిన గునుకుల రాజిరెడ్డి తండ్రి మల్లారెడ్డి వయసు 59 సంవత్సరాలు అను వ్యక్తికి 2014 సంవత్సరంలో కమాన్ పూర్ కు చెందిన పంజాల శ్రీనివాస్ ద్వారా సుదగొని కృష్ణ గౌడ్ తో పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఒక సందర్భంలో సుధగోని కృష్ణ గౌడ్, గునుగుల రాజిరెడ్డి తో రేకుర్తి శివారులోని సర్వేనెంబర్ 119 లో 25 గుంటల భూమి 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకునే ఉంటుందని, భవిష్యత్తులో వ్యాపార పరంగా ఉపయోగపడే అవకాశం ఉందని అది ప్రస్తుతం అమ్మకానికి కలదని తెలుపగా, రాజిరెడ్డి అట్టి భూమి కొనుగోలుకు ఒప్పుకోగా, సుధగోని కృష్ణ గౌడ్ మరియు జక్కుల మల్లేశం ఇరువురు కలిసి ఉమ్మడిగా గుంటకు ఆరు లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకుని 31 లక్షలను ముందుగా భయానగా ముట్టచెప్పి అట్టి భూమి యొక్క హద్దు నిర్మాణాలు చేపట్టెందుకు వెళ్లగా, ఇతరులు అట్టి భూమి తమదని తనతో గొడవకు దిగారని బాధితుడు రాజిరెడ్డి తెలిపాడు. ఇదే విషయాన్ని సుధగోని కృష్ణగౌడ్ కు తెలపగా ఆ భూమికి బదులుగా తనకు తెలిసిన వేరొక భూమి సర్వేనెంబర్ 79/B లో 20 గుంటల భూమి అమ్మకానికి కలదని, కానీ అది గుంటకు 9 లక్షల చొప్పున ఇప్పిస్తానని తెలిపారని, అయినా ఒప్పుకున్నని ఈ విషయమై 2016 సంవత్సరం జూలై 1వ తేదీన సేల్ అగ్రిమెంట్ డీడ్ కూడా చేసుకున్నామన్నారు. తర్వాత సర్వేనెంబర్ 79/బి లో అమ్మకానికి గల 20 గుంటల భూమి కొనుగోలుకై వివిధ వాయిదాల్లో 76 లక్షలు సుధగోని కృష్ణ గౌడ్ కి చెల్లించామని తదుపరి భూమి రిజిస్ట్రేషన్ చేయించవలసిందని కోరగా, కంకణాల భాగ్యలక్ష్మి మరియు కంకణాల సుజాత పేరిట ఉన్న 700 చదరపు గజాలను, రాజిరెడ్డి తమ్ముడైన గునుకుల సంపత్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడని, తదుపరి మిగిలిన భూమి రిజిస్ట్రేషన్ చేయించమని కోరగా వడ్డేపల్లి కరుణాదేవి భర్త రాజయ్య పేరిట ఉన్న 1210 చదరపు గజాల భూమిని తన సోదరుడైన గునుకుల సంపత్ కుమార్ పేరిట 2017 వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించాడని బాధితుడు గునుకుల రాజిరెడ్డి తెలిపాడు. పై రిజిస్ట్రేషన్ చేయించిన భూములకు సంబంధించిన లింకు డాక్యుమెంట్లు సుధగోని కృష్ణగౌడ్ ను అడగగా గజ్జల స్వామి పేరుపై 2006 జనవరి రెండో తేదీ పై జిపిఏ కాబడిన డాక్యుమెంట్ ఇచ్చాడని, ఆ డాక్యుమెంటు పరిశీలించుకోగా అది కూడా వివాదాల్లో ఉన్న ధ్రువపత్రమని తెలిసిందని బాధితుడు తెలిపారు. నిజానికి హస్తపురం అంజయ్య తండ్రి దుర్గయ్య కు 1991 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిందని, 2002వ సంవత్సరంలో 10 గుంటల భూమిని రేకుర్తికి చెందిన వడ్డేపల్లి కరుణాదేవి భర్త రాజయ్యకు మిగిలిన 10 గుంటల భూమిని వడ్డేపల్లి రాకేష్ తండ్రి రాజయ్యలకు అమ్ముకున్నాడని తెలిసిందని బాధితుడు అన్నారు. ఇదిలా ఉండగా బాధితుడు గునుకుల రాజిరెడ్డి 700 చదరపు గజాల భూమిని గజ్జల స్వామి పేరిట తిరిగి జిపిఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడని,అదే 700 చదరపు గజాలను గజ్జల స్వామి, కంకణాల భాగ్యలక్ష్మి, కంకణాల సుజాతల పేర్లిట రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపాడు. ఇట్టి విషయమై సుధ గౌడ్ ని కృష్ణ గౌడ్ ని తుడు పలుమార్లు తన వద్ద తీసుకున్న డబ్బులకు భూమి రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా కోరగా పలుమార్లు దాటవేశారన్నారు. ఎన్నిసార్లు ఇట్టి విషయమై అడిగిన సుధగోని కృష్ణ గౌడ్ స్పందించకపోగా ఇప్పటివరకు కాలయాపన చేస్తూ వచ్చాడన్నారు. ఇదిలా ఉండగా సుధగోని కృష్ణగౌడ్ ఒకరోజు గునుకుల రాజిరెడ్డిని రేకుర్తిలోని తన ఆఫీసుకు పిలిపించి కోలప్రశాంత్ ను పరిచయం చేస్తూ తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తాడని తెలిపాడన్నాడు. ఈ విషయమై వీరివురు కలిసి సుధగోని కృష్ణగౌడ్ మరియు కోల ప్రశాంత్ భూమి సెటిల్మెంట్ అగ్రిమెంట్ అని తయారుచేసి తను కొనుగోలు చేయాలనుకున్న భూమి బసవయ్య పేరిట ఉందని ఆ సమస్యను పరిష్కరించేందుకుగాను మొత్తంగా 50 లక్షల రూపాయలు ఇవ్వవలసిందిగా కోరారన్నాడు . వేరే గత్యంతరం లేక అడ్వాన్స్ గా 20 లక్షల రూపాయలు తనకు 2021 వ సంవత్సరం జూలై ఆరో తేదీన కోల ప్రశాంత్ కు అప్పగించానని మిగిలిన మొత్తం 30 లక్షల సమస్య పరిష్కరించిన తరువాత ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపాడు. సమస్యను పరిష్కరించాలని, తాను ఇచ్చిన డబ్బులకు గాను భూమిని రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా బాధితుడు పలుమార్లు కోరినప్పటికీ మళ్ళీ మిగిలిన 30 లక్షలు ఇవ్వవలసిందిగా లేనియెడల భూ సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంటామని, సమస్యలు సృష్టిస్తామని, అవసరమైతే చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారన్నారు. ఆలస్యంగా గ్రహించిన బాధితుడు గునుకుల రాజిరెడ్డి, తను పూర్తిగా మోసపోయానని తెలుసుకున్న బాధితుడు గునుకుల రాజిరెడ్డి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు తనకు జరిగిన అన్యాయం పై శుక్రవారం నాడు ఉదయం ఫిర్యాదు చేయగా నందు కేసు 52/2024 నమోదు చేసి విచారణ జరుపగా బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సుధగోని కృష్ణ గౌడ్ గునుకుల రాజిరెడ్డికి నకిలీ ధ్రువపత్రాలు నిజమైనవిగా చూపించి ఒక కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించడమే గాక బెదిరింపులకు గురిచేసానని విచారణలో తేలింది. పై అక్రమ చర్యలకు పాల్పడినందుకు గాను ముగ్గురు వ్యక్తులపై
1) రేకుర్తికి చెందిన సుధగోని కృష్ణ గౌడ్ తండ్రి నరసయ్య వయసు 42 సంవత్సరాలు
2) మల్యాల మండలం రామన్నపేట కు చెందిన చేలేటి భరత్ రెడ్డి తండ్రి నచ్చరెడ్డి 38 సంవత్సరాలు.
3) కోల ప్రశాంత్ 17వ డివిజన్ కార్పొరేటర్.
లపై 420, 465, 467, 468,471,386,506,120-b r/w 34 IPC ల ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదవు చేసి గౌరవ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ కోర్టు నందు హాజరుపరచగా గౌరవ మెజిస్ట్రేట్ 14 రోజుల కస్టడీని విధించి. రిమాండ్ కు తరలించారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş