ఎంపీఓ ముందరనే గొడవలు
మాటల యుద్ధం మితిమీరి
అంగీలు చింపుకునే స్థాయికి వచ్చింది
ప్రజా పాలన దరఖాస్తులు క్షేమమేనా ?
బలగం టీవి, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం రోజున అధికారి ముందు ఇద్దరు కార్యదర్శులు ప్రజా పాలన దరఖాస్తుల విషయంపై మాటల యుద్ధం ప్రారంభమై, ఆ ఇద్దరు కొట్టుకొని,గల్లలు అంగీలు చింపుకునే వరకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే:
ప్రజాపాలన దరఖాస్తుల విషయంపై మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు మాట మాట పెరిగి గల్లలు పట్టుకొని, కొట్లాటకు దారి తీసింది.పనులు నిమిత్తం మండల పరిషత్ కి వెళ్ళిన ప్రజలు ఇట్టి గొడవను చూసి ఆశ్చర్యపోయారు.ప్రజా పాలన దరఖాస్తులు క్షేమంగా ఆన్లైన్ అవుతున్నాయా? అన్న అనుమానాలు మండలంలో చర్చనీయాంశంగా మారింది . కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తులు క్షేమమేనా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.దీనిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టాలని మండల, గ్రామ ప్రజలు కోరుచున్నారు.