బలగం టివి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామం దగ్గర సాయంత్రం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని నీలోజిపల్లి గ్రామానికి చెందిన కడుదుల నాగరాజు బోయినిపల్లి నుండి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు.గొర్ల కాపరైన సంబ బాలయ్య తన పనులు ముగించుకొని టీవీఎస్ ఎక్సెల్ పై తిరిగి విలసాగార్ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.