జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీ..

0
75

మెరుగైన సేవలు అందించాలని ఆదేశించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత

బలగం టీవీ, సిరిసిల్ల:

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ రజిత సిరిసిల్ల అధ్యక్షతన గురువారం సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు మరియు స్కానింగ్ కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత) ప్రమాణాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ (జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ) పద్ధతులు, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆసుపత్రి సిబ్బంది వివరాలు, ధరల పట్టికలు (రేట్ల బోర్డులు) మరియు వ్యాధిగ్రస్తులకు కనీస వసతుల లభ్యతను DM&HO బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించారు. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్ల రికార్డులను పరిశీలించి, వాటికి సంబంధించిన ‘ఫామ్ ఆఫ్ ఆడిట్’ పత్రాలను సరైన రీతిలో నింపి, వెంటనే తమ కార్యాలయంలో సమర్పించవలసిందిగా స్పష్టం చేశారు.

ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సంపత్ కుమార్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here