బలగం టివి ,,రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనీషా అనే నిరుపేద యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.. యువతి కుటుంబ పరిస్థితులు,ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న గోపా(గౌడ్స్ అఫీషియల్స్& ప్రొఫెషనల్) సభ్యుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ గౌడ్ ముందుకు వచ్చి యువతి చదువు నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.. వారు మాట్లాడుతూ ఆర్థికంగా లేని గౌడ కులస్తులకు అండగా గోపా కమిటీ పని చేస్తుందని అన్నారు.మనీషా తండ్రి మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకొని మనీషా చదువు కోసం సహాయం చేయడం జరిగిందని అన్నారు.చదువుకోవలని ఉండి ఆర్థికంగా లేని గౌడ యువతి యువకులకు గోపా కమిటీ అండగా ఉండి సహాయం చేస్తుందని అన్నారు.గౌడ్ ల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మర్రిపెళ్లి చక్రవర్తి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి లక్ష్మినారాయణ గౌడ్,అంజయ్య వేములవాడ గోపా అధ్యక్షుడు సంపత్ గౌడ్,రాంగోపాల్,మర్రిపెల్లి అంతయ్య, రుద్రoగి మండల ఆడహక్ కమిటీ సభ్యులు మర్రిపెళ్లి ప్రశాంత్,శ్రీవర్షగౌడ్,గంధం మనోజ్,రుద్రoగి గౌడ సంఘం అధ్యక్షులు పల్లి గంగాధర్,అంజయ్య,భూమయ్య,నరవేణి సత్తయ్య,మోతె నర్సయ్య,బండపల్లి చిన్ననర్సయ్య తదితరులు పాల్గొన్నారు..