బలగం టివి, రాజన్న సిరిసిల్ల
మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై, మైనర్లకు వాహనాలు ఇస్తు ప్రోత్సాహిస్తున్న తల్లిదండ్రులపై,వాహన యజమానులపై చట్ట ప్రకారం కేసులు
జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ లు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగినదని తల్లిదండ్రులు,వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనం ఇవ్వకూడదని, వాహనం ఇచ్చినచో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మైనర్ డ్రైవింగ్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠినంగా వ్యవహరిస్తు చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతున్నరు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించవద్దని తల్లిదండ్రులకు,వాహనాల యజమానులకు సూచించారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు.మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల, మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.