బలగం టివి,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జిందం రేఖ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య వంతమైన జీవన విధానం పెంపొందించుకోవాలని పలు సూచనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.2030 నాటికి ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో డిసెంబర్ 12న ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సుపర్ వైజర్ శ్రీనివాస్, ఎంఎల్ హెచ్ పి సౌజన్య, ఏఎన్ఎం స్రవంతి, కరుణశ్రీ,సుమతి,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.