బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- పదవి లేదు.. రాదనే ప్రష్టేషన్ లో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతుండు – బీఆర్ఎస్ నేత మాట్ల మధు
- ఫస్ట్ ముస్తాబాద్ జడ్పీటీసీగానైనా గెలిచి కేటీఆర్ గురించి మాట్లాడాడు
- కేటీఆర్ పై అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించిన నాయకులు‘
- కేటీఆర్ వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టే ఆది శ్రీనివాస్..పస్ట్ నియోజకవర్గాన్ని బాగుచేసుకుని మాట్లాడితే మంచిది
- తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు
ఈ సందర్భంగా సర్పంచుల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షులు మాట్ల మధు మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రాంతాన్ని ఏం అభివృధ్ది చేయలేదని,ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని కేకే మాట్లాడం హాస్యాస్పదమని అన్నారు. ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదని మాట్లాడం అవివేకమని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పచ్చటి పొలాలతో కళకళలాడిన ఈ ప్రాంతం ఇప్పుడెందుకు నెర్రెలు పారుతుందని అన్నారు.
కేటీఆర్ ను తిడితేనన్న.. కాంగ్రెస్ పార్టీలో మంచి పదవస్తాదని కేకే మహేందర్ రెడ్డి ఆలోచన ఉన్నట్లుందని, మల్కపేట రిజర్వాయర్ ఎవరు కట్టారో నీకు తెల్వదా? అని, ఇదే జిల్లాలో అన్నపూర్ణ, మిడ్ మానేరు ప్రాజెక్ట్ లను ఎవరు కట్టించారో నీకు తెల్వద అని, నువ్వు సిరిసిల్ల వ్యక్తివా?… ఆంధ్ర వ్యక్తివా?..తెలుసుకొని మాట్లాడు అని, అమావాస్యకు ఓసారి సిరిసిల్లకు వచ్చే నువ్వు..కేటిఆర్ ని విమర్శిస్తావా అని అన్నారు.
రంగనాయక సాగర్ ద్వారా మండలానికి నీళ్లు తేవడానికి కృషి చేసింది కేటీఆర్ అని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీ నాయకులకు అడిగి తెలుసుకుంటే బెటర్ అని,ఇక్కడి ప్రాంతానికి నీళ్ళు వచ్చాయని కాంగ్రెస్ నాయకులే కేటీఆర్ కు పాలాభిషేకం చేసిన విషయం మర్చిపోయరా అని అన్నారు.కాలువ నిర్మాణం కోసం 60 ఎకరాల భూమికి కంపన్షేషన్ ఇస్తే ఇప్పుడు కేవలం 3 ఎకరాలకు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని,కాంగ్రెస్ నాయకులతోని ఏం కాదనే ..కేటీఆర్ కు రైతులు మొరపెట్టుకున్నారని, మంత్రి ఉత్తమ్ కుమార్ తో సంప్రదింపులు జరిపి ఇక్కడి ప్రాంత రైతులకు నీళ్లు తెచ్చిన ఘనత కేటీఆర్ ది అని,బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కాలువల ద్వారా నీలెట్ల వచ్చినయి..ఇప్పుడేమయ్యిందని, కాంగ్రెస్ అసమర్ధత పాలన మూలంగానే రైతులకు సాగు నీళ్లు లేక గోస పడుతున్నారని అన్నారు. తన స్వంత డబ్బులను రైతులకు నష్టపరిహారం అందించి రైతులకు అండగా ఉన్న వ్యక్తి కేటీఆర్ అని,కలెక్టర్ ఎందుకు పట్టించుకుంట లేడో అర్దం కావట్లేదు..కేకే మహేందర్ రెడ్డి చెప్పుడు మాటలు విని కలెక్టర్ అభాసు పాలైతుండని కేసీఆర్ అంటే శనేశ్వరామా?…రేషన్ డీలర్ల కోసం పైసలు వసూలు చేసినా నిన్నెం అనాలి అని అన్నారు.
ఓ బీద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ టీ స్టాల్ పెట్టుకుంటే ఓర్వవని, ఓ అమాయకపు రైతును జైల్లో పెట్టిస్తావ దమ్ముంటే కేటీఆర్ తో తలపడు అమాయకపు ప్రజల మీద కాదు నీ ప్రతాపం అని అన్నారు. డేరా బాబాలెక్క తిరుగుడు తప్ప సిరిసిల్ల కు ఆది శ్రీనివాస్ ఏం చేసిండో చెప్పాలని సిరిసిల్ల కు ఏమైన చేసినవా?.. పస్ట్ నీ వేములవాడ నియోజకవర్గాన్ని సక్కదిద్దుకో అని,అమాయక ప్రజాలపై అక్రమ కేసులు పెట్టీ జైలు లకు పంపిన కానీ ఆది శ్రీనివాస్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి రాదని,కేకే మహేందర్ రెడ్డికి అసలు పదవే లేదని అన్నారు. వార్డు మెంబర్ గెలవనోల్లు కూడా కేటీఆర్ ను విమర్శించడం తగదు అని, పస్టు ముస్తాబాద్ జడ్పీటీసీ గా గెలిచి కేటీఆర్ ను విమర్శించు అని మరోసారి కేటీఆర్ పై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజి ఎంపీపీ పడిగేలా మానస రాజు,మాజి సర్పంచ్ కొయ్యడ రమేష్,ఎగువమామిడి రమణారెడ్డి, బండి జగన్,ఇమ్మానేని అమర్ రావు,గుండు ప్రేమ్ కుమార్,కుర్మా రాజయ్య,మీసాల కృష్ణ,మసీపెద్ది శ్రీకాంత్ రావు,కోడం సంధ్య రాణి,యాదా నరేష్,నవీన్ రెడ్డి,కందుకూరు రామగౌడ్,కృష్ణ రెడ్డి,ఎగుర్ల కర్ణాకర్,సయ్యద్ అఫ్రోజ్,బీమని అరవింద్ తదితరులు పాల్గొన్నారు.