బలగం టివి , రాజన్న సిరిసిల్ల
బహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు లింగంపల్లి మధూకర్ అధ్యక్షతన సిరిసిల్ల లోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకని భాను పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో అమ్ముడుపోని ఓట్లతో అమ్ముడు పోని నాయకత్వాన్ని రాజకీయ యుద్ద సైనికులను సంసిద్దం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఉన్నత వర్గాల్లోని వ్యాపారులు వారి మనుగడ కోసం బహుజన వర్గాలను ఓట్లువేసే రాజకీయ యంత్రాలుగా మార్చుతున్నారని రానున్న పార్లమెంటు, స్థానిక సంస్థల్లో నీతివంతమైన అమ్ముడుపోని ఓటర్లను సిద్దం చేయాలని అమ్ముడుపోని ఓటర్ల నుండే అమ్ముడుపోని నాయకత్వం రూపాంతరం చెందడం జరుగుతుందని బహుజన రాజకీయ సంఘటిత శక్తిని సంసిద్ద పర్చాలని పిలుపునిచ్చారు కచ్చితమైన బహుజన రాజకీయ శక్తిని పెంపొందించుకోవాలని ఆదేశించారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు దొడ్డె సమ్మయ్య,ఎనగందుల వెంకన్న,గజ్జెల అశోక్,రాష్ట్ర కార్యాలయ మేనేజర్ నేరెళ్ళ హన్మంతుగౌడ్, మాజీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల భూమేష్ ముదిరాజ్, జిల్లా ఇంచార్జ్లు బట్టురామచంద్రం,మ్యాకల మునీంధర్, జిల్ల అధ్యక్షులు వర్ధవెల్లి స్వామీగౌడ్,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ద్యాగల లక్ష్మీ,బహుజన సమాజ్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు,గూడూరు సర్పంచ్ చాకలి రమేష్ ఉపాధ్యక్షులు చంద్రూనాయక్,ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేంధర్,కోశాధికారి మహ్మద్ అభ్ధుల్ నభీ, జిల్లా కార్యదర్శి అరుకల రమేష్,జిల్లా నాయకులు తాళ్ళపల్లి అంజయ్య, శ్యాగ యాదగిరి, పొత్తూరి మల్లేశం, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేర్గు రాజు,పట్టణ మహిళా అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు