*ముఖ్యఅతిథిగా జిల్లా ఫిషరీస్ చైర్మన్ రామచంద్రం.
- ముదిరాజులు అన్ని రంగాలలో ఎదగాలని పిలుపు
బలగం టీవి , ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లమద్ది గ్రామంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం,జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి మహాత్మ జ్యోతిబాపూలే మహనీయుల బాటలో నడవాలని పేర్కొన్నారు.ఎలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సక్రమార్గంలో మంచి సమ సమాజం ఏర్పరచాలని యువతను కోరారు. రాజకీయంగా,ఆర్థికంగా బలపడాలని అందరితో చేదోడు వాదోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిట్ల రాంగోపాల్, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ గాడిచర్ల దేవయ్య, గ్రామాల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ మల్లయ్య, బాపురావు ఫిషరీస్ గ్రామ అద్యక్షుడు పర్శరాములు, చంద్రయ్య చాడ శ్రీనివాస్ గూడెం ఉప సర్పంచ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.