ఉచిత వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ..

0
34

19న ఉచిత వైద్య శిబిరం – కంటి, దంత పరీక్షలు

బలగం టీవీ, తంగళ్ళపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మరియు ఎన్ 5 టీజీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కోడి అంతయ్య మాట్లాడుతూ.. తంగళ్ళపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తంగళ్ళపల్లి మార్కండేయ దేవస్థానంలో జరిగే ఈ శిబిరంలో శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ భానుచందర్ చేత ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించబడనున్నాయి.

అదేవిధంగా, ఆపిల్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డి. శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం కూడా నిర్వహించబడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రంగు అంజయ్య, రెడ్డి ఐలయ్య, రంగు రాములు, గడ్డమీది అంతయ్య, కొంగరి మల్లేశం, జంగాపల్లి దేవయ్య, పెడతపల్లి మల్లేశం, ఎన్ 5 టీజీ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీజ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here