-అభినందించిన ప్రిన్సిపాల్ అరుణ్, ఉపాధ్యాయులు.
బలగం టివి, ముస్తాబాద్
నేషనల్ గ్రీన్ కార్పస్ పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు ప్రతిపాదించిన కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ రకాల అంశాలలో డ్రామా కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాస్థాయిలో ఏకపత్రాభినయం పోటీలు నిర్వహించి ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రైజ్ మనీ అందజేశారు.ఈ పోటీలో తెలంగాణ ఆదర్శ పాఠశాల నామాపూర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని వైష్ణవి ఏకపాత్రాభినయంలో నటించి జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించడంతో పాటు రెండు వేల రూపాయల ప్రైజ్ మనీ మెమెంటో అందుకోవటం జరిగింది.ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, గైడ్ టీచర్ రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉండాలని తెలియజేశారు.ప్రకృతిలో లభించే సహజ వనరులను కలుషితం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత తెలియజేయడమే ఈ ఏకపాత్రాభినయంలో ఉన్న సందేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సింలు,శరత్, రాజశేఖర్,అనూష,షరీన్ బసవయ్య, ప్రవీణ్, శ్రీనివాస్,సుహాసిని దేవేందర్, శైలజ, కళావతి, రాజేంద్రప్రసాద్ దేవయ్య నరేష్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థి వైష్ణవిని అభినందించారు.