బలగం టీవి , ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవ శిలాఫలకాలను ధ్వంసం చేయడం అన్యాయమని శనివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్న తమ ప్రభుత్వ విధానాలను ఓర్వలేకనే కొంతమంది ఇతర పార్టీల నాయకులు పనికొట్టుకుని విధ్వంసానికి దిగడం అన్యాయం అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ శిలాఫలకాలను మంత్రి కేటీఆర్ ఓర్వలేకనే ఆయన అనుచరులు ఇలా చేయడం జరుగుతుందన్నారు.ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోకుంటే తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్,గిరిధర్ రెడ్డి,నాయకులు మర్రి శ్రీనివాసరెడ్డి,కృష్ణమూర్తి,రాజేందర్,రాజు నాయక్, ఏలూరి రాజయ్య, చిన్నబాబు,వంగ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.