-వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్..
-రుద్రoగి లో గడప గడపకు కాంగ్రెస్..
-కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు..
-రామకృష్టపూర్ పల్లె లోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం…
సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
యువత,రైతులు,పేద,బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో ని 11వ ,12వ వార్డుల్లో గడప గడపన కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ వేములవాడ,తెలంగాణలో గెలవాలని యువత బలంగా కోరుకుంటున్నారని,మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకై అందరూ పాటు పడాలని కోరారు..నియోజకవర్గ యువత కాంగ్రెస్ పార్టీ గెలుపుకై పాటు పడాలని,కాంగ్రెస్ పార్టీతోనే యువకులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు వస్తాయని,మార్పు యువతతోనే మన వేములవాడ నియజకవర్గం నుండే మొదలు కావాలని యువతకు పిలుపునిచ్చారు.నిన్నటి రోజు వేములవాడ లో తమ ప్రచార రథంపై దాడి చేయడం అధికార పార్టీ వారి పిరికిపంద చర్య అన్నారు..ప్రజలు,ప్రజాస్వామ్యలు ముక్తకంఠంతో కండిచలాన్నారు..రుద్రoగి మండల కేంద్రంలో 30 ఏండ్ల కింద ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ చేసారని కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు.. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక ఇలా భౌతికదారులకు దిగడం ఎంతవరకు సమంజమని కోరారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగరం చెరువు నిర్మాణం పూర్తయితే , 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం దానిపై కల్వర్టు నిర్మించేంత అది కూడా లేదు అని చెప్పి అన్నారు.. దయచేసి ఒకసారి ఆలోచించి మీ బిడ్డగా మీ ఊరు బిడ్డ ముందు వస్తున్న చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓకే దఫా రైతుకు పంట రుణమాఫీ, మహిళలకు 5 వందలకు సిలెండర్, నెలకు 25 వందల రూపాయలు,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు.చదువుకోవడనికి విద్యార్థులకు,యువతకు 5 లక్షల రూపాయలు,2 లక్షల ఉద్యోగా కల్పన,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అనుకుంటున్నారని అన్నారు..ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చెలకల తిరుపతి, మండల అధ్యక్షుడు తూము జలపతి,ఉప అధ్యక్షుడు తర్రె మనోహర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,బీసి సెల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ,ఎర్రం గంగానర్సయ్య,ఇప్ప మహేష్,గడ్డం శ్రీనివాస్,మాడిశెట్టి అభిలాశ్,దాసు,తర్రెలింగం తదితరులు పాల్గొన్నారు.