సిరిసిల్ల న్యూస్:
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బీజేపి ఎమ్మెల్యే టికెట్ కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమకు కేటాయించారు. వేములవాడ బీజేపి టికెట్ కోసం మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయకుడు వికాస్ రావు చివరి వరకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. బీజేపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పట్టుబట్టి తుల ఉమకు టికెట్ ఇప్పించినట్లు తెలిసింది. వికాస్ రావు కోసం బండి సంజయ్ చివరి వరకు ప్రయత్నం చేసిన దక్కలేదని తెలస్తుంది. బీజేపి జాతీయ కార్యదర్శి ఇలాకాలో తన పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపి టికెట్ల కేటాయింపు బండి సంజయ్ చేతులో లేకుండా పోయిందని రాజకీయంగా చర్చకొనసాగుతుంది. ఉద్యమ నాయకురాలు, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కు బీజేపి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో తన అభిమానుల్లో హర్షం వ్యక్తం అయ్యింది.