సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములవాడ పట్టణంలోని 27వ వార్డులో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గోలి మహేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన వారు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ మనసు గల్లా సార్ , మన సర్కారు… మన కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మశేట్టి విజయ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, సీనియర్ నాయకులు తీగల రవీందర్ గౌడ్, గజానందరావు, లైశెట్టి మల్లేశం, చేపూరి రవీందర్, శ్రీనివాస్, కొండ నరసయ్య, వాసాల శ్రీనివాస్, టేలర్ శ్రీను, సత్యనారాయణ రెడ్డి, మహేందర్, కో-ఆప్షన్ సభ్యులు బాబు, మల్లేశం వార్డు అధ్యక్షుడు రాజు, శివ, హరీష్ లతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.