సిరిసిల్ల న్యూస్:
కాంగ్రెస్ కు ఓటేస్తే చీకటి రాజ్యమే
బి.ఆర్.ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యం
కళ్ళబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ వెనకటి రోజులకు వెళ్ళాల్సిందేనని, 24గంటల కరెంట్ ఇచ్చే బి.ఆర్.ఎస్ పార్టీ కావాలా…? 3గంటలే కరెంట్ ఇస్తామంటున్నా కాంగ్రెస్ కావాలా…?ఆలోచించుకునే సమయం అసన్నమైందని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా ఆదివారం వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక, చంద్రగిరి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చాలా వెనకబడ్డామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 13ఏండ్లు కోట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాలన్నా మళ్ళీ ఒకసారి కారు గుర్తుపై ఓటేసి బి.ఆర్.ఎస్ పార్టీకి అధికారం ఇవ్వాలని, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని రకాల సమస్యలను ఏడాది లోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ-బాబు, వైస్ ఎంపిపి రవి చందర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఊరడి రామ్ రెడ్డి, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు, సర్పంచులు చెన్నమనేని స్వయం ప్రభ, రాసురి రాజేశం, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు వనపర్తి దేవరాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు గోనెల సత్తయ్య, భాస్కర్ రావులతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
