వేములవాడ దేవస్థానానికి రూ. 2.18 కోట్లతో 33/11 కేవి నూతన సబ్ స్టేషన్ మంజూరు..

0
222

బలగం టీవీ, వేములవాడ:

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఆధునిక విద్యుత్ సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేములవాడ పట్టణంలో రూ. 2 కోట్ల 18 లక్షల వ్యయంతో 33/11 కేవీ సామర్థ్యంతో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల దేవస్థానంలో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉండటంతో పాటు పరిసర ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించగలుగుతారు. ఈ సబ్ స్టేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహాయ సహకారాలతో, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిరంతర ప్రయత్నాలతో మంజూరు కావడం జరిగింది.

విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరుకు తమ వంతు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here