సిరిసిల్ల న్యూస్:వేములవాడ నియోజకవర్గం:
తన తండ్రి స్వయానా న్యాయవాది కావడంతో పాటు న్యాయ శాఖ మంత్రిగా సేవలు అందించడంతో న్యాయవాద కుటుంబం నుంచి వచ్చిన తనకు న్యాయవాదులంటే ఎనలేని గౌరవం ఉందని, బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బోయినిపల్లి వినోద్ కుమార్ తో కలిసి గురువారం వేములవాడ పట్టణంలోని బార్ అసోసియేషన్ వద్ద అసోసియేషన్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన న్యాయవాద వృత్తి వల్లనే తమ కుటుంబం ఈనాడు ఇంతటి స్థాయికి ఎదిగిందని అన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తనకు ఒక్క అవకాశం ఇస్తే, న్యాయవాదుల కష్టాలు తెలిసిన వాడిగా రాబోయే రోజుల్లో వేములవాడ కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంట రాజు, కార్యదర్శి నక్క దివాకర్, ఉపాధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రేగుల దేవేందర్, పురుషోత్తం, చెర్ల ఆనంద్ కుమార్, నర్సింగరావు, అనిల్ కుమార్, సుధాకర్ రెడ్డి, సుజీవన్, కిషోర్ రావు, బొడ్డు ప్రశాంత్, రజనీకాంత్, నాగుల సంపత్ గౌడ్, మహిళ న్యాయవాది అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.