బలగం టివి: రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎక్కిలిపురం హన్మవ్వ,చెప్పారసి ధర్మపురి,మర్రిపెళ్ళి గంగవ్వ,తర్రె నర్సయ్య లు గత రెండు రోజుల క్రితం మరణించగా విషయం తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. వారి వెంట గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,బిసి సెల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ,మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్,ఎర్రం గంగానర్సయ్య, గడ్డం శ్రీనివాస్,పల్లి గంగాధర్,గంధం మనోజ్,తర్రె లింగం,కట్కూరి దాసు,తదితరులు ఉన్నారు