సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అల్ ఇండియా పర్వాడ్ బ్లాక్ పార్టీ వేములవాడ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న వేములవాడ నియోజకవర్గం భీమారం మండల కేంద్రానికి చెందిన గల్ఫ్ కార్మిక సంఘం నేత గుగ్గిళ్ల రవిగౌడ్ను గ్రామస్తులు సత్కరించారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న రవిగౌడ్ను అభినందించారు. భి ఫాం అందుకున్న రవిగౌడ్ను భీమారం గల్ఫ్ కార్మిక సంఘ సభ్యులు సత్కరించారు.ఎన్నికల సమరానికి వీరా తిలకం దిద్ది రవిగౌడ్ వెన్నంటి ఉంటామని పేర్కొన్నారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఒక జాతీయ పార్టీ నుండి టికెట్ రావడం భీమారం గ్రామం ( మండలం) మే గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.టికెట్ ఇచ్చిన అల్ ఇండియా పార్వడ్ బ్లాక్ పార్టీ నాయకత్వానికి గుగ్గిళ్ల రవిగౌడ్ కృతఙ్ఞతలు తెలియజేశారు

