సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
చల్మెడ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన 100మంది రుద్రవరం మహిళలు, యువకులు
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మహిళలు, యువకులు సుమారు 100మంది బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. బుధవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పొన్నాల రాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊరడి రామ్ రెడ్డి, నాయకులు మెడికల్ రాజిరెడ్డి, కాసర్ల అరుణ్, తాడేం లచ్చయ్య, కూతురు బక్కయ్య, గోనె నాగరాజు, గుండెల్లి సాయి, విశాల్, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.