సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోకవర్గం:

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములాడ నియోజకవర్గం శాత్రాజ్పల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావును గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజు పల్లెలో గడప గడపకు గులాబీ జెండా ప్రచార కార్యక్రమం లో భాగంగా బీఆర్ఎస్ మెనిఫెస్టో గురించి ప్రతి ఓటరుకు వివరిస్తూ, ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ సర్కార్’ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ,కారు గుర్తుపై ఓటు వేసి “చల్మెడ” ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో మ్యాకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, మొగ్గ అనిల్ కుమార్, కొప్పెర సంతోష్ రెడ్డి, అన్నాడి జనార్దన్ రెడ్డి, ఐత వెంకటేశం, గుడిసె మనోజ్ కుమార్, గుడిసె నరేష్, సిరిసిల్ల శంకర్, సుద్దాల వీరేందర్, చందనం వెంకటేష్, విక్కుర్తి సాయి గౌడ్ పురుషోత్తం, దాసు, సూర ఎల్లయ్య, మిట్టపెల్లి రాజు, గడ్డం మధు, శివకృష్ణ, మొగిలి రమేష్, ప్రకాష్, చిగుర్ల రాజు, చిగుర్ల మహేష్, గుంటి ప్రశాంత్, జిల్లా మధు తదితరులు పాల్గొన్నారు.
