సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar)
*సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం పనితీరును పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు
సిరిసిల్ల 11, నవంబర్ 2023
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అక్రమ నగదు, మధ్యం జప్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు,1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో గమనించే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు మొదలగు నివేదికలను ప్రతిరోజు సకాలంలో సమర్పించాలని రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar) అన్నారు.
శనివారం సిరిసిల్ల లను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్నికల సమీకృత ఫిర్యాదులు పర్యవేక్షణ కేంద్రం ను
రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ (Dr.Jagdish sonkar)కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలిసి పరిశీలించారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం లో Gps మానిటరింగ్, 1950 కాల్ సెంటర్, కంట్రోల్ రూం, సి – విజిల్, ఎంసీఎంసి, సోషల్ మీడియా విభాగాల పనితీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎన్నికల సాధారణ పరిశీలకులకు వివరించారు.
ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం పనితీరు పట్ల సాధారణ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
సందర్శనలో సాధారణ పరిశీలకుల వెంట జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, జిల్లా చేనేత జౌళి అధికారి సాగర్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్ సిరిసిల్ల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి… ఎన్నికల రిజిస్టర్ ల నిర్వహణ ను పరిశీలించారు.