- పథకాల పై అవగాహన పెంచడం, ఎన్ రోల్ మెంట్ ఈ కార్యక్రమ లక్ష్యం
-:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల 14, డిసెంబర్ 2023
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం, పథకాలు అర్హులకు అందేలా తెలియజేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే ‘విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ను జిల్లాలో విజయవంతం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలనీ అన్నారు.
గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలో ఈ నెల 15 వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 15 వరకూ చేపట్టనున్న విక్‌సిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ అవగాహన , ఎన్ రోల్ మెంట్ పై జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ యాత్ర నిర్వహణ కోసం జిల్లాకు మూడు వాహనాలను కేటాయించారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల ప్రచార వాహనాలను జిల్లాలోని గ్రామ గ్రామాన, పంచాయతీలు, మునిసిపాలిటీలు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా చేయాలన్నారు.
ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీ అజయ్ గుప్తా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు జిల్లాలో తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిని తెలిపే తాజా నివేదికలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్దం చేయాలన్నారు. శానీ టేష్ న్, odf పై విద్యార్థులకు వ్యసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల తో క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు . వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ , పశుసంవర్ధక , మున్సిపల్ అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పై తాజా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు.
సమావేశంలో జిల్లా ఇంఛార్జి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, drdo నక్క శ్రీనివాస్, ldm మల్లిఖార్జున్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.