గ్రామపంచాయతీలుగా విలీన గ్రామాలు

0
137

మున్సిపల్ లో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలి….*ఎమ్మెల్యే కేటీఆర్

మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు సూచన

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలను గ్రామపంచాయతీలుగా కొనసాగించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.

మున్సిపల్ లో తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పాలకవర్గానికి ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు.

సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలీన గ్రామాల ప్రజలు మంత్రి కేటీఆర్ ను కలిశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విలీన గ్రామాలను యదా విధిగా గ్రామపంచాయతీలుగా కొనసాగించేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ మేరకు సిరిసిల్ల మున్సిపల్‌‌ చైర్‌‌ పర్సన్‌‌ జిందం కళచక్రపాణి, మున్సిపల్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ మంచె శ్రీనివాస్‌‌ పలువురు కౌన్సిలర్లు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌‌మీట్‌‌ ఏర్పాటు చేసి మున్సిపల్‌‌ లో వీలిన గ్రామాలను గ్రామపంచాయతీలుగా కొనసాగించాలని తీర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here