- రుద్రంగిలో ఇంటింటికి కాషా జండా పంపిణీ
బలగం టీవి,,రుద్రంగి:
అయోధ్యా రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామా జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రాముడి కాశయ ధ్వజం జెండాను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమన్నీ ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ రామా జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సోమవారం అయోధ్యా రామమందిరంలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంటిపై శ్రీ రాముడి కాశయ ధ్వజం జెండా ఎగురవేయలని అలాగే అక్షింతలను ఆశీర్వచనంగా తీసుకొని ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించాలని అన్నారు.బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవన్నీ జరుపుకోవాలని కోరారు.రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో రుద్రంగి హనుమాన్ ఆలయంలో భజన కీర్తనలు ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు