బలగం టివి న్యూస్:
రైతుల శ్రేయస్సు కోరే రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
గెలిచిన వెంటనే పెండింగ్ లో ఉన్న లింక్ రోడ్ల పూర్తికి కృషి చేస్తాను
అధికారంలోకి వచ్చిన 6నెలల్లోపు రెండు మండలాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
ప్రజలను మోసం చేసే పార్టీ, మోసం చేసే నాయకులన్నా పార్టీ కాంగ్రెస్
ప్రతిపక్షాల మాటలు నమ్మి….మోసపోయి గోసపడొద్దు…
మేడిపల్లి, భీమారం మండలాల పర్యటనలో భాగంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు వ్యాఖ్యలు
వరద కాలువపై ఎత్తిపోతల పథకంతో మేడిపల్లి, భీమారం మండలాలను సస్యశ్యామలం చేసి చూపిస్తామని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు హామీ ఇచ్చారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒద్దినేని హరి చరణ్ రావు, పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నలతో కలిసి మేడిపల్లి, భీమారం మండలాల్లోని రంగాపూర్, కాచారం, విలయతాబాద్, వెంకట్రావుపేట్, రాగోజిపేట్, ఓడ్యాడ్, కమ్మరిపేట, భీమారం మండల కేంద్రం, గోవిందారం, పసునూర్, మోత్కురావుపేట, రాజలింగంపేట గ్రామాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చల్మెడ మాట్లాడారు. రైతుల శ్రేయస్సు కోరి, రైతు బంధు, రైతు భీమా ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేసే పార్టీలని, అలాంటి పార్టీల నాయకుల మాటలు విని, వారిని గెలిపించి, మోసపోయి, గోసపడొద్దని సూచించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న తనను గెలిపిస్తే, గెలిచిన 6నెలల్లోపు లింక్ రోడ్ల సమస్యలతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు మండలాల్లోని అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఘన స్వాగతం పలికిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు
ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడకు స్థానిక మహిళ సోదరీమణులు బతుకమ్మలతో, మంగళహారతులతో, టపాసుల మోతాలు డప్పు చప్పుళ్ళ మధ్య ఘన స్వాగతం పలికారు. వెంకట్రావుపేట గ్రామంలో మాజీ సర్పంచ్ అంగడి ఆనందం ఆధ్వర్యంలో కర్రతో చేసిన రైతు నాగలిని బహుకరించారు. వెంకట్రావుపేట గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.
బి.ఆర్.ఎస్ పార్టీలో భారీగా చేరికలు
ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చల్మెడ సమక్షంలో రంగపూర్ గ్రామానికి చెందిన యువకులు బీజేపీ పార్టీనీ వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. కాచారం గ్రామానికి చెందిన 30మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి లక్ష్మీ నరసింహా రావు కండువా కప్పి. పార్టీలోకి ఆహ్వానించారు. అట్లాగే వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు చల్మెడకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మాణం చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమా-రాజా రత్నాకర్ రావు, వైస్ ఎంపిపి దొంతి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు వెంకటేశం, ప్యాక్స్ చైర్మన్లు రవీందర్ రావు, పానుగంటి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమ్య-ఆదిరెడ్డి, వైస్ చైర్మన్ కొప్పెర లింగారెడ్డి, నాయకులు అంకం సాగర్, రావు శ్రీనివాస రావు, ఎం.డి రాజబోస్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ విభాగం అధ్యక్షులు, సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.