రుద్రంగి గ్రామ మాజీ ఎంపిటిసి మోతే నరసయ్య సోదరుడు మోతే గంగాధర్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం రోజున బిఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు రుద్రంగి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట ఎంపీపీ గంగం స్వరూప మహేష్ తదితరులు ఉన్నారు.