- జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. సీపెక్ (తెలంగాణ సోషియో, ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే) జనాభా వివరాల ఆధారంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, జీఓ నంబర్ 9, 14 అనుసరించి మున్సిపల్ వార్డులలో రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ స్థితిగతులను తెలుపుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపాలిటీలలో వార్డుల వారిగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్ కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.
