బలగం టీవీ, తంగళ్ళపల్లి:
తంగళ్ళపల్లి మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు స్థానిక ఎస్సై ఉపేంద్ర చారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు ఒక ప్రకటన ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల దృష్ట్యా, తేదీ 12-12-2025 సాయంత్రం 05:00 గంటల నుండి తేదీ 13-12-2025 సాయంత్రం 05:00 గంటల వరకు తంగళ్ళపల్లి మండలంలో కొత్త వ్యక్తులు లేదా వేరే గ్రామాలకు చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ కొత్త వ్యక్తులు ఎవరైనా తమ దృష్టికి వస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని ఎస్సై హెచ్చరించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం, శుక్రవారం (12-12-2025) సాయంత్రం 05:00 గంటల నుండి ఎలాంటి ప్రచారం చేయకూడదు. అభ్యర్థులు లేదా అనుచరులు గుంపులు గుంపులుగా తిరగకూడదు. అలాగే, ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది కలిసి ప్రచారం చేయకూడదు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయబడునని ఎస్సై ఉపేంద్ర చారి స్పష్టం చేశారు.
ఎస్సై ఉపేంద్ర చారి ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడాలని కోరారు.
