అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి…

0
117

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

-ఎస్పీ మహేష్ బి. గితే

అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ వేసవి కాలంలో జరిగే చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని, రాత్రి వేళల్లో గ్రామాల్లో పట్టణాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నామని, ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోని పోలీసు వారికి సహకరించాలని అన్నారు.

ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును భద్రపర్చుకోవాలని లేదా బ్యాంక్ లాకర్లో భద్రపర్చుకోవలని, వేసవి దృష్ట్యా ఇంటి బయట నిద్రించే సమయంలో విలువైన బంగారు ఆభరణాలు లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఆదమరచి నిద్రపోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

బీరువా తాళాలు ఇంటిలోనే ఉంచకుండా తమవెంట తీసుకొని పోవాలని,ఊరికి కానీ, యాత్రలకు వేగున్నట్టు సోషల్ మిడియాలో పోస్ట్ చేయరాదని అన్నారు. విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పరాదని,ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టంను, సిసి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను మొబైల్లో వీక్షించవచ్చు అని అన్నారు. ఇంటిలోపల మరియు బయట లైటు వేసి వుంచాలని, అపార్ట్మెంట్లో సిసి కెమెరాలు లేదా వాచ్మెన్ ను తప్పక ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్ కి సమాచారం ఇవ్వలని, అట్టి అధికారుల మొబైల్ నంబర్ దగ్గర ఉంచుకోవాలని అన్నారు. ప్రజలు పోలీసులు సమన్వయం కలిసి పనిచేస్తే చోరీలను నియంత్రించుకోగలమని, ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని అన్నారు. ఎవరైన కాలనీలోని, ఆపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద కోత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే స్థానిక పోలీస్ లేక డయల్ 100, సమాచారం అందించగలరని ప్రజలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here