- నాగేష్ కుమార్తె చదువుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి హామీ.
- దినకర్మ సందర్భంగా 50 కిలోల బియ్యం వితరణ చేసిన సర్పంచ్ రచన చోటు.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
అనారోగ్యంతో మరణించిన ఇందిరమ్మ కాలనీకి చెందిన వేముల నాగేష్ కుటుంబానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాగేష్ పరిస్థితిని గతంలోనే గుర్తించిన సర్పంచ్ గడ్డం రచన చోటు, వార్డు సభ్యులు కొండ భరత్.. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే, నాగేష్ చికిత్స నిమిత్తం LOC (Letter of Credit) మంజూరు చేయించి వైద్య సహాయం అందించారు.
ఆపరేషన్ అనంతరం కోలుకుంటూ మళ్ళీ అనారోగ్య సమస్యతో నాగేష్ మరణించగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు భరోసానిచ్చారు. నాగేష్ కుమార్తె స్నేహ భవిష్యత్తు దెబ్బతినకుండా, ఆమె చదువులకు తాము పూర్తి అండగా ఉంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కె.కె. మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
బుధవారం కేసీఆర్ నగర్ (6వ వార్డు)లో నాగేష్ దినకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం రచన చోటు తన వంతు సాయంగా బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. పేద కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ప్రజా ప్రతినిధులుగా అండగా ఉండటం తమ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు కొండ భరత్, కుసుమ హేమంత్, గాజుల రాంప్రసాద్, ఖాజా, మల్లిఖార్జున, రమేష్, సతీష్, అంబటి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
