బలగం టివి, ,తంగళ్ళపల్లి
- నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ
- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి లోని వయోవృద్ధుల ఆశ్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పర్యటించిన సందర్భంగా వృద్ధులతో మాట్లాడుతూ మేమే మీ బంధువులం అధైర్యపడవద్దని నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి కలిసి
సందర్శించారు. ఈ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 33 మంది వయోవృద్ధులతో ఆమె ఆత్మీయంగా పలకరించారు. యోగక్షేమాలుతెలుసుకున్నారు అనంతరం పండ్లను పంపిణీ చేశారు.ఆరోగ్య ఎట్లా ఉంది సమయానికి మందులు వేసుకుంటున్నారా, వైద్యులు పరీక్షిస్తున్నారా,భోజనం బాగుంటుందా
కేంద్రంలో మౌలిక సదుపాయాలు బాగున్నాయా సిబ్బంది బాగాచూసుకుంటున్నారా ఆక్టివ్ గా ఉండేందుకు వాకింగ్, సులభతరమైన ఇండోర్స్పోర్ట్స్ అడుతున్నరా సంతోషంగా ఉన్నారాఅని అడిగితే వివరాలు తెలుసుకున్నారు.
కార్యదర్శి ఆత్మీయ పలకరింపుతో వృద్ధులు ఆనందభాష్పాలు రాల్చారు. కేంద్రంలో అన్ని సౌకర్యాలు బాగున్నాయని సిబ్బంది సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారని కార్యదర్శికి తెలిపారు.
ఈ వయసులో కన్నవారికి దూరంగా ఇక్కడ ఉండడం పట్ల తమ బాధను కొద్ది మంది వృద్ధులు వ్యక్తం చేశారు.
వారిని ఓదార్చిన కార్యదర్శి చింత మానండి మేమే మీ బంధువులం ….. నిరాదరణకు గురైన వృద్ధులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. మీకు ఏలోటులేకుండాచూసుకుంటామని చెప్పారు.
