బలగం టీవి….
కొత్త ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలి
➡️కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
➡️కరీంనగర్ క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలకు హాజరు
➡️నీళ్లు,నిధులు నీయమాలు చేశాము
➡️తెలంగాణలో 1.61 లక్షల ఉద్యోగాలు కల్పించాం
పద్నాలుగేళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది, కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగావా నిలపడం జరిగిందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు.
కరీంనగర్ క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరవ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి నెర్రెలు భారిన నేలలకు గోదావరి జలాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
2014కు ముందు తెలంగాణ లో 7వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండేవి.. వాటిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 25వేల మెగావాట్లకు పెంచడం జరిగిందన్నారు.
ఐటీ పరిశ్రమతో పాటు పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు.
నూతన ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనీల్ గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి,బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, కొడిమ్యాల ఎంపీపీ స్వర్ణలత,పీఏసిఎస్ చైర్మన్ రాజనర్సింగరావు, బీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి మండల అధ్యక్షుడు కొండయ్య, గజ్జెల దేవరాజు, మల్లెంకి శ్రీనివాస్, చుక్క శ్రీనివాస్,సాయికృష్ణ మహిళ బీఆర్ఎస్ నాయకురాళ్లు గందే కల్పన, ఎస్.వైజయంతి తదితరులు పాల్గొన్నారు.
