రోడ్డు ప్రమాదంలో మృ*తి చెందిన కూన తిరుపతి కుటుంబానికి అండగా ఉంటాం..

0
193

కేంద్ర మంత్రి బండి సంజయ్

బలగం టీవీ, కోనరావుపేట:

వేములవాడ నందికమాన్ కూడలి వద్ద జరిగిన RTC బస్సు ప్రమాదంలో మరణించిన కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన కూన తిరుపతి కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

శుక్రవారం కోనరావుపేట మండల పర్యటనకు వచ్చిన మంత్రి బండి సంజయ్‌ను కొలనూరులో మృతుడి భార్య కూన లావణ్య తన కుమారులు ఆదిత్య, హేమంత్, కూతురు అక్షయతో కలిసి కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న తన భర్త తిరుపతి బస్సు ప్రమాదంలో చనిపోవడంతో జీవనం దుర్భరంగా మారిందని, పిల్లల పోషణ కష్టంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

ప్రమాద వివరాలు తెలుసుకున్న బండి సంజయ్, మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొలనూరులో మంత్రి బండి సంజయ్‌తో మృతుడి కూతురు అక్షయ, కుమారుడు ఆదిత్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here