పోలింగ్ నిర్వహణ సజావుగా జరిగేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాం
*భారత ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
సిరిసిల్ల 22, నవంబర్ 2023
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి సన్నద్దంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు నివేదించారు.
బుధవారం ఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవిఎం యంత్రాల కమిషనింగ్, ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 4 లక్షల 66 వేల 677 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 70 శాతం మందికి ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలిన ఓటర్లకు నిర్దేశిత గడువులోగా ఓటరు సమాచార స్లిప్పులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నామని, రెండవ బ్యాలెట్ యూనిట్ ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, ఈవిఎం యంత్రాల కమిషనింగ్ ప్రక్రియ నవంబర్ 24 లోపు పూర్తి చేస్తామని అన్నారు.
జిల్లాలోలో ఇంటి నుంచి ఓటు సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 25 వ తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నామని అన్నారు. పోలింగ్ నాడు విధులు నిర్వహించే సిబ్బందికి ఓటు హక్కు కల్పించేందుకు పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ కేంద్రాల ను ఏర్పాటు చేసి తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించి వారికి శిక్షణ అందిస్తున్నామని, పకడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
జిల్లా పరిధిలో ఎన్నికల ప్రచార నిమిత్తం రాజకీయ నాయకులు నిర్వహించే సమావేశాలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘనలపై వెనువెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎంసీసీ నోడల్ అధికారి జితేంద్ర ప్రసాద్ , జిల్లా కార్మిక అధికారి రఫీ, చేనేత జౌళి అధికారి సాగర్, ao రామి రెడ్డి, అదనపు drdo మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.