–-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
బలగం టివి, ,వేములవాడ:
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.. బుధవారం వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఈ మద్దతు కోరి మీ ముందుకు వచ్చిన సందర్భంలో నాపై నమ్మకం ఉంచి నా విజయనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు..వేములవాడ నియోజకవర్గం తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పుకొరి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదాలు అందించారన్నారు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ అవకాశం ఇచ్చారన్నారు..పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని, 6 గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ.10లక్షలు పెంపు అమలు జరుగుతుందని అన్నారు..ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చే మరో రెండు పథకాలైన రూ. 500లకే సిలిండర్, 200యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మరో వారం రోజుల్లోగా అమలవుతుందని, దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిపారు.నియోజకవర్గంలో సాగునీటి రంగంలో అభివృద్ధిలో పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభ్యున్నతికై తోడ్పాటును అందిస్తూ, అభివృద్ధి ఓ కన్నులాగా, సంక్షేమం మారో కన్ను లాగా భావిస్తూ ముందుకు వెళ్తామని అన్నారు..
