విద్యపై రాజకీయ కక్షలు సహించం..

0
39

బిఆర్ఎస్ నేత కంచర్ల రవి గౌడ్ ఆగ్రహం

బలగం టీవీ, సిరిసిల్ల:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదని, స్పష్టమైన రాజకీయ ప్రతీకార చర్య కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు.

సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యారంగాన్ని స్వర్ణయుగంగా మలిచిన మహానాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగంపై దాడి చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే రాజకీయ కుట్రలో భాగంగానే గురుకులాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్కరణలను బలహీనపరచడం వెనుక స్పష్టమైన రాజకీయ కోణం ఉందని తెలిపారు. ఇది అభివృద్ధి వ్యతిరేక దృక్పథమే కాకుండా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కక్షతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నాలు చేస్తే, అది రాజకీయంగా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. విద్యా రంగాన్ని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మార్చితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలతో సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.
విద్యపై రాజకీయాలు ఆపి కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాపాడుదామని పిలుపిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మట్ట శ్రీనివాస్, ఎస్కే అప్రోచ్, ఆరెల్లి వినయ్ కుమార్, సాయి, రాజు, విష్ణు, రాము, నరేష్, వంశీ, నరేంద్ర, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here