మంత్రి పొన్నం ప్రభాకర్
బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
ఆదివారం రోజున ఉదయం కరీంనగర్ నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ దర్శనానికి వెళ్తూ, మార్గమధ్యంలో బోయినిపల్లి మండలంలోని నీలోజిపల్లి గ్రామంలో కొద్దిసేపు ఆగడం జరిగింది.గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనస్వాగతం పలికారు. తర్వాత పెద్ద పూలమాల మెడలో వేసి,పుష్పగుచ్చం అందజేసి, సాల్వతో ఘనంగా సన్మానించినారు. కాసేపు నిర్వాసితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా;రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ: మధ్యమానేరు (శ్రీ,రాజరాజేశ్వర జలాశయం) లో మునిగిన ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, నిర్వాసితులు అధైర్య పడవద్దని అన్నారు. నిర్వాసితుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ లకు తెలుసునని, త్వరలోనే పెండింగ్ సమస్యలని పరిష్కరిస్తామని అన్నారు. మధ్యమానేరు నిర్వాసితుల సమస్యల గురించి పోరాడింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, సమస్యలను పరిష్కరించేది కూడా తామే అని పేర్కొన్నారు. పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని,ముంపు గ్రామాలలో ఉపాధి లేక వలస వెళ్తున్నారని, నిర్వాసితులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఆయన వెంట ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్ తో పాటు బీసీ సెల్ మండల అధ్యక్షులు అనుముల హరికృష్ణ, నీలోజిపల్లి గ్రామశాక అధ్యక్షులు పెండ్లి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు నాగుల వంశీ, నాయకులు, కార్యకర్తలు , ఆయా గ్రామాల నిర్వాసితులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.