ఎస్పి అఖిల్ మహాజన్
బలగం టివి,సిరిసిల్ల: వ్యవసాయ పొలాల వద్ద,వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణుల, ప్రజల ప్రాణాలకు విఘాతం కలిగిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తామాని ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఎస్పి అఖల్ మహాజన్ మాట్లాడుతూ
జిల్లాలో అడవి జంతువులను వేటాడటానికి విద్యుత్తు తీగలను అమర్చిన, పంట పొలాల కోసం వ్యవసాయ పొలాల వద్ద ఎవరైనా వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వారం రోజులలో జిలాల్లో ఇలాంటి సంఘటనలు ఎల్లారెడ్డిపేట,కొనరావుపేట,రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు కావడం జరిగిందని అన్నారు..వన్యప్రాణుల వేట కోసం,పంట పొలాలను వన్యప్రాణుల నుండి కాపాడటం కోసం కరెంట్ తీగలను ఏర్పాటు చేయడం వలన పంట పొలాల్లో పనులకు వెళ్లే రైతులు,జంతువులు షాక్ నకు గురయ్యి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది.జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు సంభవించి అమాయకులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని అన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ జంతువులను వేటాడటం కోసం కరెంటు తీగలను ఏర్పాటు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,అవసరమైతే పిడి యాక్ట్ అమలు అమలు చేయడం జరుగుతుందని,గతంలో కొనరావుపేట్ మండలంలో విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మరణానికి కారణం అయిన వ్యక్తి పై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగిందని అన్నారు.ప్రజా నివాస ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా,లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్,పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు ఈ సందర్భంగా హెచ్చరించారు.జెలాటిన్ స్టిక్స్,పేలుడు వంటి పదార్థాలు ఎవరైనా నిల్వ ఉంచుకున్న,ఎవరి దగ్గరైన అయిన ఉన్నాయన్న సమాచారం ఉన్న డయల్ 100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ లకి సమాచారం అదించాలని ,సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.