:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
బలగం టివి, రాజన్న సిరిసిల్ల : .
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., పిలుపునిచ్చారు.
జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి గాంధీ,అంబేద్కర్,గోపాల్ నగర్, కొత్త బస్టాండ్,నేతన్న చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై బైక్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., .

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని,ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్యత గుర్తించాల్సిన అవసరం వుందని. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించి వాహనాలను నడపడం ఒక హీరోయిజంగా భవించవద్దని, అలసత్వం వలన జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ముఖ్యంగా తమ కుటుంబ క్షేమంకన్నా మన క్షేమం కోసం నిరంతరం శ్రమించేది పోలీసులు మాత్రమేననిప్రతి వాహనదారుడు క్రమశిక్షణతో వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకోవచ్చని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని తెలిపారు.
వాహనదారులు జరిమానాలు పడ్డాయని అనుకోకుండా వుండాలంటే ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన ద్వీచక్రవాహనదారులు మరణించడం జరుగుతోంది. కావున, ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని అన్నారు.
ఈ ర్యాలీలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి,టౌన్ సి.ఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు..