పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత – జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్

0
214

తంగళ్లపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కి విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టి తీసుకవచ్చిన నేపధ్యంలో పోలీస్ స్టేషన్ లో విశ్రాంతి గదులను నిర్మించి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ24/7 విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరం అని దానికి అనుగుణంగా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కి విశ్రాంతి గదులు నిర్మించడం జరిగిందన్నారు.జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది యెక్క సంక్షేమం విషయంలో జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని,వారికి అవసరమైనా అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం, సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల ఆదరణ పొందాలన్నారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలు పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,రూరల్ సి.ఐ సదన్ కుమార్,టౌన్ సి.ఐ ఉపేందర్,ఎస్.ఐ వెంకటేశ్వర్లు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here