*నిర్లక్ష్య ధోరణిలో అధికారులు.
- చర్యలు తీసుకోవాలని నాయకుల డిమాండ్.
బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గూడు లేని నిరుపేదల కొరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2008 సంవత్సరంలో సర్వేనెంబర్ 998,999,1001, లలో 13 ఎకరాల ఐదు గుంటల భూమి కొనుగోలు చేసి అధికారికంగా 162 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందని, మిగిలిన ఖాళీ ఇండ్ల స్థలాలను కొంతమంది ఇతర గ్రామాల నుండి వచ్చి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన స్పందించక పోవడంతో అక్రమ ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ కాలనీ అడ్డగా మారిందని చింతోజి బాలయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటీ నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేదల కోసం 156 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ముస్తాబాద్ గ్రామానికి చెందిన అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించకుండా ఇతర ప్రాంతాల వారికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఇండ్ల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలకు తుంగలో తొక్కి అధికారులు తమ ఇస్తారాజ్యంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని, మిగిలిన ఖాళీ ప్లాట్లను అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా ఆక్రమించుకొని ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులకు పాలకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇదే ఆసరాగా కొంతమంది ఉద్యోగులు డబ్బులకు ప్రలోభ పడి అక్రమ నిర్మాణాలు జరుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తూరని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల వారు ఇండ్ల స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడం వెనుక అసలు సూత్రధారులు ఎవరని,మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ప్రస్తావించగా వెంటనే స్పందించిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శరత్ రావు అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన లేదని వెల్లడించారు.నేటి వరకు అక్రమ నిర్మాణాల పైన చర్యలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొంతమంది గ్రామ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రజలు పాలకులు అధికారులు కలసి సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందని మండలంలో అధికారులు మాత్రం ప్రజా ప్రతినిధుల ఆదేశాలను బేకాతర్ చేయడం ఏమిటని..? ప్రశ్నించారు ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఇందిరమ్మ కాలనీలో జరిగిన అక్రమ ఇళ్ల నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని గ్రామంలో గూడు లేని నిరుపేదలను గుర్తించి అధికారికంగా పట్టాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.