బలగం టివి ,రాజన్నసిరిసిల్ల

➡️అభివృద్ధి కి ఐదుకొత్తలు తీసుకురాని…బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు
➡️సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్
➡️ఉపాధిహామీ, మహిళ సంఘాలకు ఇచ్చే నిధులను కూడా బండి సంజయ్ తెచ్చినట్టు చెబుతున్నారు
➡️2014లో ఎంపీగా గెలిచి మనోహరబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మంజూరు చేయించి..సిద్దిపేట వరకు రైలు నడపటం జరుగుతుంది
➡️అబద్దాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
➡️ఇచ్చన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలి
➡️బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తాం
➡️సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను కుదిస్తామని అంటే చూస్తూ ఊరుకునేవారు లేరిక్కడ
14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగిందని, 2004లో 5 మంది ఎంపీలు గెలిచి కేసీఆర్ గారి వెంట నడిచి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్ కేంద్ర మంత్రివర్గంలో చేరడం జరిగిందని, 2006లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని కాంగ్రెస్ మోసం చేయడంతో కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి పోరాటం చేయడం జరిగిందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చి,పదేళ్లు పాలించడం జరిగిందని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని,ఆచరకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని, రైతు భరోసా ద్వారా ఎకరాకు ₹15000, కల్యాణలక్ష్మీ ద్వారా ₹లక్ష ,తులం బంగారం, ప్రతి మహిళకు₹ 2500లు ,₹500లకె సిలిండర్, 200ల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు.కాంగ్రేస్
దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చారని,ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం సమస్యలపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత మంది కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీకి లేరని,
త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రజలను మర్చిపోతుందని, మంత్రులు, ఎమ్మెల్యే లు ఇప్పటికి ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నారని అన్నారు.
తాను పార్లమెంట్ మెంబర్ గా కృష్ణ, గోదావరి నదులపై ఇరిగేషన్ ప్రాజెక్టుల అనుమతులు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల అనుమతులు
తీసుకురావడంలో కీలకపాత్ర పోషించానని పేర్కొన్నారు.
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ 9వేల కోట్లు ఎక్కడ నుంచి తెచ్చాడో చెప్పాలని, కేంద్రం నుంచి ఉపాధిహామీ, ఆరోగ్యం, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రతి ఏటా వచ్చే నిధులు కూడా బండి సంజయ్ ₹9వేల కోట్లు తెచ్చానని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కరీంనగర్, సిరిసిల్ల,పిట్లం
సిరోంచ, భూపాలపల్లి, హుజురాబాద్, ఎల్కతుర్తి, సిద్దిపేట, నాందేడ్ వరకు జాతీయ రహాదారి మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు.
2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు ఎం చేయలేదని,
తాను 2014లో ఎంపీ అయ్యాక రైల్వే అధికారులతో మాట్లాడి,సికింద్రాబాద్ (మనోహరబాద్) నుంచి కరీంనగర్(కొత్తపల్లి) వరకు రైల్వే లైన్ తెచ్చామని,
రాష్ట్ర ప్రభుత్వం భూసేకర చేసి ఇచ్చిందన్నారు.
ఐదేళ్లు రైళ్లు నడిస్తే నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు కట్టాలని అప్పటి మంత్రి పీయూష్ గోయల్ అన్నారని,అయిన కూడా బెదరకుండా సిద్దిపేట వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తి చేసి రైలు నడపటం జరుగుతుందన్నారు.
33జిల్లాలను కుదిస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడటం పద్ధతి కాదని, జిల్లాలను కుదిస్తే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరన్నాను.
ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఏడాదికి 10వేల మంది వైద్యులను తయారు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు.