ఎస్పీ మహేష్ బీ. గితే
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
భర్త హత్యకు కారణమైన భార్య తో పాటుగా మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కక్కరికి 2000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేష్ బీ. గితే శుక్రవారం ఓ ప్రకటన లో తెలిపారు.
ఎస్పీ మహేష్ బీ. గితే తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన దరంసోత్ శంకర్ నాయక్ కి ఇద్దరు భార్యలు మొదటి భార్య దరంసోత్ సరోజకు పిల్లలు పుట్టడం లేదని రాజవ్వ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు జన్మించారు, అప్పటినుండి మొదటి భార్య అయిన దరంసోత్ సరోజ వారిపై పగ పెంచుకొని గొడవలు పడుతూ ఉండేది, వారికున్న ఆస్తి అంతా రెండవ భార్య మరియు వారి సంతానానికి రాసిస్తాడు అనే భయంతో తన భర్తశంకర్ నాయక్ ను గత 2020 సంవత్సరం నవంబర్ 11 తేది శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సరోజ, ఆమె తమ్ముడైన బానోతు శ్రీనివాస్, చెల్లెలు తేజావత్ లక్ష్మి ల తో కలిసి భర్త శంకర్ నాయక్ కి మందు బాగా తాగించి రోకలిబండతో కొట్టి ముగ్గురు కలిసి చంపినారు. రెండో భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు అప్పటి సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపించరని,తరువాత సిఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు.
కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా,ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించాగా, పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులైన ఏ 1- దరంసోత్ సరోజ, ఏ 2- బానోతు శ్రీనివాసు, ఏ 3- తేజావత్ లక్ష్మి అను ముగ్గురికి జీవిత ఖైదీతో పాటు ఒక్కొక్కరికి 2000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని అన్నారు. నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సర్వర్, ఉపేందర్, ప్రస్తుత సిఐ మొగిలి, ఎస్ఐ గణేష్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు , కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లను ఎస్పీ అభినందించారు.
