భార్య ..కూతురే హంతకులు.. సిరిసిల్ల లో హత్య కేసులో ఇద్దరి అరెస్టు

సిరిసిల్ల న్యూస్​:

హత్యకు ఉపయోగించిన కత్తి,గొడ్డలి,పెద్ద కత్తి, పెట్రోల్ తో ఉన్న రెండు ప్లాస్టిక్ క్యాన్స్,గడ్డపార,.పార,తట్ట,రెండు మొబైల్ ఫోన్స్,మసి కల్గిన బ్లాంకెట్,రక్తపు మరకలు గల బట్టలు స్వధీనం.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్.

నిందితుల వివరాలు.
A1.లేచర్ల స్వప్న, భర్త: ప్రకాష్ రావు, 39 సంవత్సరాలు, కులం: వెల్మ, r/o శివానగర్, సిరిసిల్ల.
A2. లేచర్ల ఉషా శ్రీ, తండ్రి : ప్రకాష్ రావు, 18 సంవత్సరాలు, కులం: వెల్మ, r/o శివానగర్, సిరిసిల్ల.

మీడియా సమావేశంలో సి.ఐ మాట్లాడుతూ…..
సిరిసిల్ల పట్టణం శివ నగర్ చెందిన లేచర్ల ప్రకాష్ రావు తండ్రి: రామారావు, వయసు: 49 సంవత్సరాలు, కులం: వెల్మ r/o
అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి డబ్బులు విచ్చల విడిగిగా ఖర్చు చేస్తూ భార్య, బిడ్డలు ఆయన లేచర్ల స్వప్న, భర్త: ప్రకాష్ రావు, 39 సంవత్సరాలు, లేచర్ల ఉషా శ్రీ, తండ్రి : ప్రకాష్ రావు లను అక్రమ సంబందాలు పెట్టుకున్నారని రోజు ఇష్టం వచ్చినట్లు భూతులు తిడుతు, కొడుతుండేవాడని భరించలేక మనసులో పెట్టుకొని నిందితులు ప్రకాష్ ని ఎలాగైనా చంపాలని పథకం వేసుకొని పథకం ప్రకారం తేదీ 01-11-2023 నాడు ప్రకాష్ రాత్రి పడుకున్న తర్వాత అందాదా 12:00 గంటల తరువాత నిందితురాలు స్వప్న కూరగాయలు కోసే కత్తితోని ప్రకాష్ మెడ పై దాడి చేయగా మృతుని బిడ్డ అయిన లేచర్ల ఉషాశ్రీ దిండుతో ప్రకాష్ మొఖం మీద పెట్టి ఒత్తగా,ప్రకాష్ చనిపోయిన తర్వాత మృతుణ్ణి గొడ్డలితో ముక్కలు చేయడానికి ప్రయత్నించగా, ముక్కలు కాకపోవడంతో తెల్లవారి మరొక కత్తిని కొనుక్కోచ్చి అట్టి కత్తి తో కూడా నరికి ముక్కలు చేయుటకు ప్రయత్నించినప్పటికి వారి వల్ల కాకపోవడంతో ఇంటిలోనే గుంతను తవ్వి శవాన్ని పాతిపెడదామని ఇంట్లోని గడ్డపార, పారా మరియు తట్ట సహాయంతో గుంతను త్రవ్వి దానిలో శవాన్ని ఉంచి ఇంటిలో ముందుగా తెప్పించుకొని పెట్టుకొన్న పెట్రోల్ పోసి శవాన్ని కాల్చగా శవం పూర్తిగా కాలిపోలేదు. దానితో ఆ మరుసటి రోజు అనగా తేదీ 03-11-2023 నాడు స్వప్న తన తమ్మున్ని పిలిపించుకొని విషయం చెప్పి, తన తమ్మునితో మరలా పెట్రోల్ తెప్పించుకొని, మృతుని శవాన్ని కాల్చి ఎక్కడనైనా బూడిదని పడపోయాలని అనుకోని మృతుని శవం పై పెట్రోల్ పోసి నిప్పు అంటించగా ఒక్క సారిగా మంటలు లేచినందున అట్టి మంటలకు ఇల్లు కాలిపోతదని, చుట్టూ పక్కల వారికి విషయం తెలుస్తదని భయపడి మంటలను నీటితో మరియు చెద్దరి కప్పి ఆర్పీ వేసి దహన క్రియలు చేద్దామని అనుకోని, మరుసటి రోజు అనగా తేదీ 04-11-2023 నాడు తెల్లవారిజామున A1 తన బాబాయిని పిలిపించుకొని విషయం అంతా చెప్పగా, అతను A1 కు మృతుడు నిద్రలో చనిపోయినాడని అందరికీ చెప్పి దహనం చేద్దామని సలహా ఇవ్వగా, అట్టి సలహా మేరకు దగ్గరి బంధువులకు చెప్పగా, కొద్ది మంది బంధువులు రాగానే పై నలుగురు వ్యక్తులు కలిసి అసలు విషయం ఎవరికి చెప్పకుండా హుటాహుటిగా వైకుంట రథములో ఎక్కించుకొని విద్యానగర్ లో గల వైకుంట దామము లోకి తీసుకు పోయి దహన క్రియలు చేసినారు. పిర్యాది అయిన మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కి మృతుని యొక్క దహన క్రియలు హుటాహుటిగా బందువులు ఎవరు రాకుండానే చేసినారని తెలువగా, ఫిర్యాది మృతుని ఇంటికి వెళ్ళి చూడగా ఇంటికి తాళం వేసి ఉండీ దుర్వాసన వచ్చినందున మరియు బందువులు ఎవరు రానందున మృతుని మరణములో అనుమానము ఉందని ఫిర్యాదు చేయగా సిర్సిల్ల ఇన్స్పెక్టర్ ఉపేందర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తులో బాగంగా పై విషయాలు బయటపడినందున నిందితులు A1 & A2 లను ఈ రోజు వారి ఇంటి వద్ద పట్టుకొని కోర్టులో హాజరు పరచనైనది. అరెస్టు చేసిన సమయంలో నిందితుల వద్దనుండి 1.కత్తి, 2.గొడ్డలి, 3.పెద్ద కత్తి, 4. పెట్రోల్ తో ఉన్న రెండు ప్లాస్టిక్ క్యాన్స్, 5.గడ్డపార, 6.పార, 7.తట్ట, 8.రెండు మొబైల్ ఫోన్స్, 9.మసి కల్గిన బ్లాంకెట్, మరియు 10.రక్తపు మరకలు గల బట్టలు మొదలగు వాటిని స్వాదీన పర్చుకొనైనది.అలాగే ఈ కేసులో నిందితులకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి. ఉపేందర్ గారు తెలిపారు.

ఈ ప్రెస్ మీట్ లో క్రైమ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీకాంత్, అరుణ,పద్మ ,గోపాల్ ఉన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

Jeetwin

Jeetbuzz

Baji999

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş sekabet giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş Sekabet Sekabet Sekabet Giriş Sekabet Güncel Giriş