బలగం టీవి , గంభీరావుపేట :
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు, శారీరిక దారుడ్యం, మంచి ఆరోగ్యం లభిస్తుందని సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి, ఎంపీటీసీ రాజేందర్ అన్నారు. ఆదివారం గంభీరావుపేట మండలం మాల్లారెడ్డిపేట గ్రామంలో సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా సర్పంచ్ శెట్టి మహేశ్వరీ రవి,ఎంపీటీసీ రాజేందర్ హాజరై గెలుపొందిన గుర్జు వారియర్స్ కీ మొదటి బహుమతి 3000వేల రూపాయలు నగదు ను,ట్రోపీ, రన్నరపుగా నిలిచిన మినప సాయి టీం కి 1500 నగదు, ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
యువత మద్యానికి బానిసలు కాకుండా క్రీడల్లో పాల్గొంటే దేశ భవిష్యత్తు మార్చగలరు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు యువత అండగా ఉండాలని మార్పు ఒక్క అడుగుతో మొదలవుతుంది కాబట్టి క్రీడలతో పాటు చదువులో ముందుండి గ్రామం నుండి మండల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఎదగాలని యువతను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ తో పాటు గ్రామంలోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు