బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
అంతర్జాతీయ ఉమెన్స్ డే వేడుకలను శనివారం సిరిసిల్ల పట్టణంలోసేవా భారతీయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వనజ, డాక్టర్ శ్రీమతి లీలా శిరీష హాజరై మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళలు ఒకవైపు కుటుంబం మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు.
