అధిక మెజారిటీతో గెలిపించాలని నాయకుల ప్రచార
సిరిసిల్ల న్యూస్: ఎల్లారెడ్డిపేట
రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం తో పాటు చుట్టుపక్క గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, మాజీచైర్మన్ కొండ రమేష్ గౌడ్,అందె సుభాష్, సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు మామిళ్ళ తిరుపతి లు వెంకటాపూర్, అగ్రహారం, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో కారు గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటా ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి కేటీఆర్ అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లతో అన్నారు.